ప్రారంభమైన తొలిరోజే హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి అత్యధిక మంది ప్రయాణికులను తరలించిన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డును సొంతం చేసుకుంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీని గమనించిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..
I am told while day 1 of Hyd Metro broke all records, on day 2 also we are noticing a surge
Request @hydcitypolice @hmrgov @ltmhyd to stay on high alert to manage crowd
Appeal to fellow Hyderabadis to be considerate to kids, elderly & other passengers. It’s our metro, our pride
— KTR (@KTRTRS) November 30, 2017
మెట్రో స్టేషన్ల వద్ద రద్దీని నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. రద్దీని నియంత్రించాలని కోరుతూ నగర పోలీసులు, మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగర వాసులకు కూడా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది మన మెట్రో. మనకు గర్వకారణం. చిన్నారులు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మెట్రో ప్రయాణికులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.