ఏపీ అధికార పార్టీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత ,ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు .
ఈ రోజు గురువారం సాయంత్రం వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరబోతున్నారు .దీనిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశించి పార్టీ మారడంలేదు అని ఆయన తెలిపారు .
ఇంకా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అనవసరం అని అన్నారు .ఇంకా మాట్లాడుతూ ” ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో ప్రముఖ స్టార్ హీరో ,పవన్ సోదరుడు అయిన మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆయన జీవితంలో అతి పెద్ద తప్పు …చిరంజీవిను ఉద్దేశించి మాట్లాడుతూ పొలంలో విత్తనాలు వేస్తే సరిపోదు..అవి మొలకెత్తి పంట పండాలి కదా..?’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు .అన్నయ్య సాధించలేనిది తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధిస్తాడా ..పవన్ రాజకీయాలకు పనికి రాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .