సూర్యాపేట మండలం టేకుమట్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ లో జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోరిక మేరకు మంత్రి జగదీష్ రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేసి..జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.65కోట్లు మంజూరైందని తెలిపారు. దీంతో మూసీ ఆయకట్టు చివరి భూములకూ నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
