ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు రోజు రోజుకు పెట్రేగిపోతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .గొట్టిపాటి చేరికను మొదటి నుండి టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు .
గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి .ఒకానొక సమయంలో రవికుమార్ వర్గీయులు కరణం వర్గీయులను చంపే స్థాయికి కూడా వీళ్ళ గొడవలు పెరిగాయి .తాజాగా ఇరువురు రాష్ట్ర సచివాలయంలో తారసపడ్డారు .ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ అరుచుకున్నారు .ఒకానొక సమయంలో ఇద్దరు ఎదురుపడి కొట్టుకుంటారా అనే పరిస్థితులు ఏర్పడ్డాయి .అయితే మంత్రి శిద్దా రాఘవరావు ఎంట్రీ ఇచ్చి ఇరువురును సముదాయించారు .