తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది .నిరుద్యోగుల పట్ల పార్టీ పక్షపాత వైఖరిని అవలబిస్తుంది .నిరుద్యోగుల తరపున మేము పోరాడతాం అని ఆయన అన్నారు ..రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
