ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ సూచన చేశారు. ఈరోజు అనగా (గురువారం ) శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. గన్నవరం విమానాశ్రయంలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.16వేలు వెచ్చించాల్సి వస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అధిక చార్జీలతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అధిక చార్జీల వల్ల ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని గాలి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సర్కార్ సీరియస్గా తీసుకుని దృష్టి పెట్టాలని గాలి ముద్దుకృష్ణమ సూచించారు. వీలైనంత త్వరలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రిని కోరారు.