రెండో రోజు గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్లో ఉదయం ప్రత్యేక షెషన్లో మాడరేట్ చేసిన మంత్రి కెటి రామారావు రోజంతా పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీగా గడిపారు. ఊబర్ ఎక్స్చేంజ్ విజేతల్లో హైదరాబాదుకు అగ్రాసనం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్, ప్రముఖ క్యాబ్ షేరింగ్ సంస్థ ఊబర్ కలిసి నిర్వహించిన ఊబర్ ఎక్స్చేంజ్ పోటీల విజేతలను ఇవ్వాళ జీఈఎస్. కాన్ఫరెన్సులో మంత్రి కేటీఆర్ ప్రకటించారు
దేశవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలు ఈ పోటిలో పాల్గొనగా పది సంస్థలను తుది విజేతలుగా ఇవ్వాళ ప్రకటించారు. ఇందులో హైదరాబాదుకు చెందిన సంస్థలే అయిదు ఉండటం సంతోషకరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. అంకుర సంస్థలకు హైదరాబాద్ స్వర్గధామంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తర్వరలోనే ఏలక్ర్టిక్ వెహికిల్ పాలసీ తీసుకుని వస్తుందన్నారు. నిన్ననే ప్రారంభం అయిన మెట్రోకు మారుమూల ప్రాంతల నుండి కనెక్టివీటీ మొరుగుపరిచేందుకు కోసం దేశంలోని అన్ని మోబిలీటీ స్టార్ట్ అప్స్ ప్రయత్నం చేయాలని కోరారు. ఊబర్ ఇండియా హెడ్ అమిత్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కాగా, ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ థిల్లై రాజన్ రచించిన “ఫ్యుయల్ ఫర్ స్టార్టప్స్”పుస్తకాన్ని ఇవ్వాళ జీఈఎస్ కాన్ఫరెన్సులో మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సి.ఈ.ఓ అమితాభ్ కాంత్ ఆవిష్కరించారు. అంకుర సంస్థలు, వెంచర్ క్యాపిటల్ రంగంపై రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఈ రంగంలోకి వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పుస్తకం ఆవిష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ అన్నారు. జీ.ఈ.ఎస్ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉన్నదని మంత్రి అభిప్రాయపడ్డారు.