ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్ వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. రాత్రి అక్కడే ఆయన బస చేయనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం …పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.
