తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు ..
వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .ఈ నేపథ్యంలో మహిళల పారిశ్రామిక నైపుణ్యాల అంశం మీద ఇవంకా ట్రంప్ ,చందా కొచ్చార్ ,చెర్రీ బ్లెయిర్ తదితరులతో జరిపిన ప్లీనరీలో మంత్రి కేటీఆర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .ఆ క్రమంలో విలేఖరి మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరు అని అడిగాడు .దీనికి సమాధానంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ నా జీవితంలో నా కూతురే అత్యంత శక్తివంతమైన మహిళ అని అంటూ నవ్వారు .