నేడు ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉందో లేదో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది .అంతగా స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది .ప్రస్తుతం రోజుల్లో ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు . రోజుకో మోడల్ రావడం ..ధరలు కూడా తక్కువగా ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది .
అయితే స్మార్ట్ ఫోన్ల విరిగా వాడటం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అని ఇప్పటికే పలు సర్వేలు ,ప్రయోగాలు తెలిపాయి .తాజాగా ఐఐటీ ముంబాయి ఒక సంచలనాత్మక విషయాన్నీ బయటపెట్టింది .అదే స్మార్ట్ ఫోన్ల్ వినియోగమ వలన యువతలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నాలుగు వందల రెట్లు శాతం అధికంగా ఉంది అని తెల్పింది .
ముంబాయి ప్రొఫెసర్ గిరీష్ కుమార్ ఆలీగర్ విశ్వవిద్యాలయంలో “సెల్ ఫోన్స్ రెడియోషన్ ..వాటి దుష్ప్రభావాలు అనే విషయం మీద మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ల్ ను అధికంగా వాడటం వలన యువత ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .రేడియేషన్ ప్రభావం నెమ్మదిగా శరీరంలోకి చేరుతుందని దీంతో మహిళల్లో సంతానోత్పత్తి వ్యవస్థపై ,పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది ఆయన తెలిపారు .అంతే కాకుండా నరాల బలహీనత ,అల్జీమర్ ,వణుకుడు రోగాలు వస్తాయి అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు .