వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో మతపరమైన చర్చప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయంలో పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన దేవాలయంలోని నాన్ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేశారు. తాను హిందువును కానని ఆయన స్వయంగా ప్రకటించారు.అయితే నిబంధనల ప్రకారం హిందువులు కానివారు సోమ్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించినపుడు, ఎంట్రీ రిజిస్టర్‌లో సంతకం చేయవలసి ఉంటుంది. తమ మతాన్ని ప్రకటించవలసి ఉంటుంది.గతంలో రాహుల్ గాంధీ తాను హిందూ బ్రాహ్మణుడనని ప్రకటించారు. తాను భగవద్గీత చదువుతానని, శివభక్తుడినని ఆయన చెప్పారు.