బాగ్జీయనగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
ఫలక్ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.