అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు నగరంలో సికింద్రాబాద్ కి చెందిన మణికంఠ అనే వ్యక్తీ హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి దాడి చేసిన సంగతి తెల్సిందే .
అయితే వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు .అయితే బిత్తిరి సత్తి మీద జరిగిన దాడి గురించి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు,ప్రముఖ సామాజిక సేవకుడు రమేష్ చరి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి ను కలిశారు .ఈ సందర్భంగా వారు హోమ్ మంత్రిని కల్సి రవికుమార్ మీద దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి .
ఈ దాడి వెనక ఉన్నవారిని కూడా బయటకు తీసుకురావాలని ఆమె కోరినట్లు మంత్రి నాయినికిచ్చిన లేఖలో ఉంది .అనంతరం నర్సింగ్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ నిషా పాలే మాట్లాడుతూ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ కి వస్తున్నాపేరు ప్రఖ్యాతలు తట్టుకోలేక దాడులు దిగుతున్నారు .దాడులు చేస్తే ఫేమస్ కారు .
సొంత టాలెంట్ ,సత్తా ఉండి ఆయా రంగాల్లో రాణిస్తేనే అందరు గుర్తిస్తారు .రవి వెంట మా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంతా ఉన్నామని ఆమె తెలిపారు .. అనంతరం రమేష్ చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కళలకు ,కళాకారులకు కొదువ లేదు .దాడులకు దిగినంత మాత్రాన కళాకారులూ తమ కళను ప్రదర్శించకుండా వెనక్కి వెళ్ళరు .దాడులు చేసిన వారిని ప్రభుత్వం కటినంగా శిక్షించి మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అన్నారు ..