తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో కొత్తగా 1,764 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అందులో బీబీనగర్ రంగాపూర్ పరిధిలోని నిమ్స్ దవాఖాన కోసం 873 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు 251, రాష్ట్రంలో అప్‌గ్రేడ్ చేసిన 13 సర్కారు దవాఖానల్లో పనిచేసేందుకు 640 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అందులో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఎంఎన్‌జే రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎన్‌జేఐవో అండ్ ఆర్సీసీ)లో పనిచేసేందుకు 251 కొత్తపోస్టులను మంజూరుచేయగా, వీటిని క్యాటగిరీవారీగా ప్రకటించాల్సి ఉంది.
