దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు బుధవారం కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
సీతారామ, పాలమూరు ఎత్తపోతలకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు హరీష్ చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం సిండికేట్ పాలసీ తేవాలని విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం ఆయన మంత్రి హరీష్ మాట్లాడుతూ రైల్వే, ఇరిగేషన్, జాతీయ రహదారుల అనుమతులను అత్యవసర అనుమతులుగా చూడాలని తెలియజేశామన్నారు.కాలుష్య నివారణకు కఠినమైన చట్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.