ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. దీనికి కారణం, ఇతర హీరోల ప్రోగ్రామ్స్‌కు అటెంట్ అవడం, తన సినిమా ప్రోగ్రామ్స్‌కు ఇతర హీరోలను పిలవడం, ఇలా తను కేవలం మెగా మేనల్లుడినే కాదని, అందరి వాడినంటూ చాటిచెబుతున్నాడు సాయి ధరమ్‌తేజ్.
అయితే, తాజాగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత శనివారం పవన్ కల్యాణ్ 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పోస్టర్‌లో ఐడీ కార్డు చేతపట్టుకుని, ఇంటెన్స్ టుక్‌తో కనిపించాడు పవన్. అజ్ఞాత వాసి టైటిల్‌నే కన్ఫాం చేస్తూ పవన్ కల్యాణ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌పై సాయి ధరమ్‌తేజ్ తనదైన శైలిలో స్పందించాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం ప్రమాదం.. అందులోను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్‌లుక్ విడుదలయ్యేటప్పుడు అస్సలు వాడొద్దంటూ సలహా ఇస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మామయ్యపై మేనల్లుడు చాలా డిఫరెంట్‌గా తన అభిమానాన్ని చాటుకున్నాడంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.