ఏపీలోని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సంపతి ధనారెడ్డి(68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈ విషయం తెలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడు అల్లాబకాష్ తదితరులు ధనారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ధనారెడ్డి టీడీపీ జిల్లా కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు.
