అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసిన ఇవాంకా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు వచ్చిన ఇవాంకా తన తొలిరోజు పర్యటనలో భాగంగా ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే