భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..ఇవాళ ( బుధవారం)తెల్లవారుజామున హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ – నాగోల్ మధ్య నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి . ప్రయాణికులతో హైదరాబాద్ మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి.మెట్రో రైలులో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ మెట్రోస్టేషన్లో మొట్ట మొదటి టికెట్‌ను ప్రయాణికుడు సంతోష్ కుమార్ తీసుకున్నారు.