ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు .
తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే చేశాను అని అన్నారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసుల చిరకాల వాంఛ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ నిన్న భారతప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెల్సిందే .ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “హైదరాబాద్ మెట్రో ఘనత నాదే .
అప్పట్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నేను హైదరాబాద్ మెట్రో రైల్ కోసం పోరాడాను .మెట్రోను బెంగుళూరు ,అహ్మదాబాద్ నగరాలకే పరిమితం చేస్తే నాడు నేను పోరాడటం వలనే హైదరాబాద్ మహానగరానికి మెట్రో వచ్చిందన్నారు .అయితే హైదరాబాద్ మహానగరంలో మెట్రో కి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బీజం పడిన సంగతి తెల్సిందే .