చంద్రబాబు కుఠిల రాజకీయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విలువలు మూటగట్టి.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు డబ్బు, ప్రాజెక్టులు, పదవి ఆశలు చూపిమరీ ఇతర పార్టీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా చంద్రబాబు తన కుఠిల రాజకీయాలను కొనసాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని తన పార్టీలోకి ఆహ్వానించారు.
మరి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ మారారంటే చిన్న విషయం కాదు.. అందులోనూ రాజ్యసభ ఎన్నికలకు మరికొంత సమయమే ఉన్న సమయంలో పార్టీ మారడమంటే కొంచెం ఆలోచించే విషయమే మరి.
అయితే, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చాలా కాలం నుంచే మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే, అప్పట్లో బేర సారాలు కుదరకపోవడంతో, ఫలితాలు (అనుకున్నంత స్థాయిలో మొత్తం పలకకపోవడంతో) సానుకూలంగా రాకపోవడంతో గిడ్డి ఈశ్వరి విముఖత చూపిందని టీడీపీ నేతలతోపాటు గిడ్డి ఈశ్వరి అనుచరులే అంటున్నారు.
తాజాగా పై వ్యాఖ్యలను రుజువు చేస్తూ గిడ్డి ఈశ్వరి తాను పార్టీ మారడానికి గల అసలు కారణాలను తన అనుచరుల సాక్షిగా బట్టబయలు చేసింది. తన కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. అయితే, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తన అనుచరుల మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఇప్పుడు వైసీపీని వీడటం అవసరమా..? అంటూ అనుచరుల ప్రశ్నించగా.. అందుకు స్పందించిన గిడ్డి ఈశ్వరి.. టీడీపీలో జాయిన్ అయిన వెంటనే మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు హామీ ఇచ్చాడని, ఒకవేళ అది కుదరని పక్షంలో మంత్రి హోదాతో ఎస్టీ కార్పొరేషణ్ ఛైర్మన్ పదవి ఇస్తానని తనకు గట్టి నమ్మకం కలిగేలా చంద్రబాబు హామీ ఇచ్చారని, ఎమ్మెల్యేగా ఉంటే పనులేమీ కావట్లేదని, వస్తే మంత్రి పదవి.. అదీ కాకపోతే ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తుంది కాబట్టి.. ఎన్నికలు వచ్చేలోగా పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని కార్యకర్తలతో అన్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.
అయితే, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో పై మాటలు మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీస్తున్నారని గ్రహించిన ఆమె.. అంతా మన వాళ్లే కదా.. బయట వాళ్లు ఎవరూ లేరు కదా..! ఎవరైనా వీడియో షూట్ చేస్తున్నారేమో చూడండి అంటూ గిడ్డి ఈశ్వరి ఆందోళనకు గురైనట్లు సమాచారం. కానీ, ఆమె అసలు స్వరూపాన్ని బయట పెట్టాలనే ఓ యువకుడు ధైర్యంగా వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.