ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది .
రాష్ట్రంలో నిన్న మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన అనుచరవర్గం ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన యువతతో భేటీ అయ్యారు .ఈ భేటీ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముందు మూడు నుండి నాలుగు కుర్చీలు ఖాళీగా ఉన్నకానీ సాటి ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ ను కూర్చోమని చెప్పకుండా ఒక ఎమ్మెల్యే కిచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా నిలబెట్టారు .అయితే ఇదే సందర్భంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ,ఆర్థిక మంత్రి యనమల ,ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ తో పాటుగా ప్రభుత్వ అధికారులు కూర్చొని ఉండటం గమనార్హం .
అయితే ఈ సంఘటన మీద స్పందించిన రాజకీయ వర్గాలు ,విశ్లేషకులు స్పందిస్తూ కూర్చోవడానికి కుర్చీ ఉన్నా కానీ కూర్చోలేని పరిస్థితి జలీల్ ఖాన్ కి ఎందుకు వచ్చింది…. ఇది ఖచ్చితంగా ముస్లిం జాతికి జరిగిన అవమానం.. కేవలం ముస్లిం శాసనసభ్యుడు అని చిన్న చూపా… లేదా పార్టీ మారడానికి మేము డబ్బులు పెట్టి కొన్నాం కదా పడి ఉంటాడని అహంకారమా…. మా అగ్రకులపోల్ల ముందు నువ్వు నిల్చొనే ఉండాలని ఏమైనా గర్వమా…. అధికారంలో ఉన్నాం అని కండకావరమా….అని వారు విమర్శిస్తున్నారు .
