అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియకు మరో సారి ఘోర అవమానం జరిగింది. స్వయాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవహేళనగా మాట్లాడారు. అలాగే, మొన్నీమధ్య విజయవాడ సాగరసంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియను మాత్రమే బాధ్యులను చేస్తూ టీడీపీ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అఖిల ప్రియను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంతలా అంటే.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందుకొచ్చానబ్బా.. అనేంతలా..!
అంతటితో ఆగక టీడీపీ ప్రతిష్టను అఖిల ప్రియ దిగజార్చుతుందంటూ పలువురు మంత్రులు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏకంగా చంద్రబాబు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సైతం అఖిల ప్రియపై ఫైర్ అవడమే కాక.. వార్నింగ్ కూడా ఇచ్చాడు.పై వ్యాఖ్యలను రుజువు చేస్తూ.. మంత్రి అఖిల ప్రియ టార్గెట్‌గా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్ కొనసాగాయి. అయితే, ఈ సమావేశాల్లో
బుధవారం తెలుగు భాషపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా తెలుగు భాషపై మంత్రి అఖిల ప్రియ తన అభిప్రాయాన్ని చెబుతున్న తరుణంలో వెంటనే కలుగ చేసుకున్న శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగు దేశం సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ తన పదునైన మాటలతో అఖిల ప్రియకు చురకలంటించారు. శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడాలని చెప్పే మంత్రి అఖిల ప్రియే సభలో ఆంగ్లంలో చెబుతున్నారంటూ ఎద్దేవ చేశారు. కేవలం అఖిల ప్రియనే కాకుండా ఇక నుంచి మంత్రులు కూడా అసెంబ్లీలో ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు.అనంతరం స్పందించిన మంత్రి అఖిలమ్మ ఇకపై అన్ని శాఖలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్..
అయితే, ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరును చూసిన నెటిజన్లు స్పందిస్తూ..
భూమా నాగిరెడ్డి ఉన్నంత వరకు అఖిల ప్రియపై కామెంట్ కాదు కదా..!.. కనీసం ఈగ కూడా వాలేది కాదని, అయితే, భూమా నాగిరెడ్డి మరణానంతరం.. భూమా కుటుంబం రాజకీయంగా స్థిరత్వం కోల్పోవడం ఒక కారణమైతే… వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ కావడంతో మరో కారణం. టీడీపీ కార్యకర్తల నుంచి.. నేతల వరకు భూమా అఖిలప్రియపై చులకన భావం ఉందని స్పష్టమవుతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.