వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులతో యువభేరి అని మీటింగ్‌లు పెట్టి జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, చంద్రబాబును విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులు ఫలానా రీతిలో నడుచుకోవాలని, భవిష్యత్‌కు ఏవిధంగా బంగారు బాట వేయాలనే విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని ఈ సందర్భంగా అనిత ప్రశ్నించారు.విద్యార్థుల ఆత్మహత్యలను ఎంతసేపూ రాజకీయ కోణంలో చూస్తున్నారే తప్ప ఏనాడు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నపాటి సూచన కూడా చేయలేదని ప్రశ్నించారు