టీంఇండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా తన ముప్పై ఒక్కటి వ జన్మదిన వేడుకలను నిన్న సోమవారం జరుపుకున్నారు .అయితే రైనా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ క్రికెట్ గాడ్ ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆయన కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు .ఈ సందర్భంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన రైనా చేత కేకును కట్ చేయించాడు మాస్టర్ బ్లాస్టర్ .ఆ తర్వాత కేకు ను సురేష్ రైనాకు తినిపించి బర్త్ డే విషెస్ చెప్పారు .ఈ క్రమంలో రైనాకు కేకును తినిపిస్తున్న ఫోటోను సచిన్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు .రైనాతో పాటు ఆయన భార్య ప్రియాంక ,కూతురు గ్రేసీయా కూడా సచిన్ పోస్టు చేసిన ఫోటోలో ఉన్నారు ..మాస్టర్ ఆతిధ్యానికి రైనా ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు ..
