తెలంగాణ యాష ..భాషను ..నరనరానా జీర్ణించుకొని గత కొంతకాలంగా ఎంతో పాపులారిటీను సంపాదించుకొని ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మదిని దోచుకున్న’ తీన్మార్ ‘బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ అలియాస్ చేవెళ్ళ రవి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అయితే ,నిన్న సోమవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 ఛానల్ కార్యాలయంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ..సినిమా షూటింగ్ కు బయలుదేరిన బిత్తిరి సత్తి మీద మద్యం త్రాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎటాక్ చేసిన సంగతి తెల్సిందే .ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనను చూసిన వారి నివ్వెరపోయారు .బిత్తిరి సత్తి మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ సంఘం తీవ్రంగా ఖండించింది .
ఆ సంఘం తరపున సంఘం కన్వీనర్ లక్ష్మణ్ రుదవాత్ , నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే నిషా(సుస్మిత )బిత్తిరిసత్తిని పరామర్శించారు .అనంతరం లక్ష్మణ్ రుదవాత్ మాట్లాడుతూ “ఎన్నో ఉద్యమాలు ,పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల ఎదుగుదలను ఓర్వలేకఒక్క వైపు తెలంగాణ సమాజం మొత్తం ప్రపంచ తెలుగు మహాసభలకు జరుపుకోవడానికి సిద్దమవుతున్న ఈ తరునంలోతెలంగాణ మట్టిలో పరిమళించిన కళాకారుడిపై దాడి చేయడం హేయమన్నారు .ఇది ఒక్క బిత్తిరి సత్తి మీద జరిగిన దాడి కాదు యావత్ తెలంగాణ కళాకారులపై జరిగిన దాడి అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు .ఒక్క తెలంగాణ కళాకారులపై దాడి అంటే ..తెలంగాణ సమాజం పైన తెలంగాణ యాష, భాషా సాంస్కృతి పై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు .
తెలంగాణ కళాకారులు ఇప్పటి వరకు ఎన్నడు తాము ఎదుటి వ్యక్తి మరియు సమాజం మనోభావాలు దెబ్బతినేవిధంగా ప్రవర్తించిన సందర్భాలు లేవనే ఆయన అన్నారు .ఎదుటివారి మనోభావాలను గౌరవించకుండా ..వారు నొచ్చుకొనే విధంగా ప్రవర్తిస్తూ నిన్న నర్సులను నేడు అనాథల మనోభావాలను కించపరుస్తూ ప్రోగ్రామ్స్ చేస్తున్న వారిని వదిలిపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో అణగదొక్కబడిన తెలంగాణ యాష ,భాష ,సంస్కృతి ని ప్రపంచానికి చాటిచేపుతున్న బిత్తిరి సత్తి మీద దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు .భౌతిక దాడులతో తెలంగాణ కళాకారుల టాలెంట్ ను కనుమరుగు చేయలేరు .కళాకారులకు ముఖ్యంగా బిత్తిరి సత్తికి అండగా ఉంటామని ..దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేవరకు మా సంఘం తరపున పోరాడతాం అని ఆయన తెలిపారు .అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే నిషా మాట్లాడుతూ “బిత్తిరి సత్తిని అలియాస్ రవి పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం .రవి వెంట యావత్తు నర్సింగ్ సంఘం తో పాటు ,తెలంగాణ సమాజం ఉంది అన్న సంగతి మరిచిపోవద్దు అని ..రవి కి న్యాయం జరిగేవరకు పోరాడతాం అని ఆమె తెలిపారు ..