ఏపీలో మహిళలపై చాల దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చిన శిక్షలు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే తాజాగా ఓ కామాంధుడు అత్యంత దారుమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో పడేయించింది.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొండవూరు గ్రామానికి చెందిన కోనారి గణపతి(38) తండ్రి వెంకట్రావు 18 ఏళ్ల కిందట మరణించాడు. అప్పటి నుంచి గణపతి తల్లితో కలిసి ఉంటున్నాడు. తిండి పెట్టి, జేబుఖర్చులకు ఇచ్చి, లోటు లేకుండా తల్లిపైనే కన్నేశాడు. ఆమెను కొట్టి, చంపుతానని భయపెట్టి, తరచూ లైంగిక అత్యాచారానికి పాల్పడేవాడు. తల్లి అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతూ వచ్చిది.
గణపతి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల కూతురు ఇంటికి వెళ్లింది. అక్కడకు కూడా గణపతి వెళ్లేవాడు. సొంత చెల్లెలి ముందే తల్లిని వేధింపులకు గురి చేయసాగాడు. ఈ పరిస్థితుల్లో గేదెల మాధవరావు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యా డు.
తన కుమారుడి వ్యవహారమంతా ఆయనతో చెప్పుకొని ఆమె బాధపడింది. తన కుమారుడిని చంపడానికి సాయం చేయాలన్న ఆమె కోరింది. అందుకు అతను అంగీకరించాు. గణపతిని ఈ నెల 8వ తేదీన మాధవరావు నమ్మించి బయటకు తీసుకుని వెళ్లాడు.
పలాస-కాశీబుగ్గ సమీపంలోని మీలగారంపాడు గ్రామానికి తీసుకెళ్లాడు. దారిలో చిత్తుగా మద్యం తాగించాడు. పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకోగానే కత్తితో పొడిచి గణపతిని చంపేశాడు. తలను, మొండాన్ని వేరు చేసి గోనెసంచిలో చుట్టి, ఓ చెరువులో పడేశాడు.
