గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 2017 కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, కూతురు ఇవాంక ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునారావృత నమూనాలతో కూడిన మైక్రో మోజాయిక్ బాక్స్‌ను ఆమెకు అందజేశారు. అత్యంత నైపుణ్యంతో తయారుచేసే ఈ బాక్స్ ను ప్రధాని సూరత్ నుంచి తెప్పించి ఇచ్చారు.ఈ బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
