తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇవాళ్టి నుంచి జరగనున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి చేరుకున్నారు.ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడున్న అధికారులతో ఆమె కరచాలనం చేశారు. అనంతరం మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్వీట్ చేశారు.
Thank you for the warm welcome. I’m excited to be in Hyderabad, India for #GES2017. https://t.co/1U08h5L9Rm
— Ivanka Trump (@IvankaTrump) November 28, 2017
మీ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. తాను జీఈఎస్2017 సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ రావడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు.
సాయంత్రం 3గంటలకు ఆమె జీఈఎస్ సదస్సు జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. సుష్మా స్వరాజ్‌తో భేటీ అయిన అనంతరం ఆమె సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు.