తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కలల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది. నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో పైలాన్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచర్, దృశ్యమాలికను విడుదల చేశారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి దృశ్యమాలికను వీక్షించారు.అనంతరం మెట్రోరైల్ ఎక్కి కూకట్పల్లి బయలుదేరారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మియాపూర్ నుంచి బయలుదేరి హెచ్ఐసీసీకి చేరుకున్నారు. హెచ్ ఐసీసీలో జీఈఎస్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.మెట్రోలో ప్రయాణించిన వారిలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.
PM @narendramodi inaugurates #HyderabadMetroRail pic.twitter.com/JGmh9D9HFN
— Doordarshan News (@DDNewsLive) November 28, 2017