ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) ప్రారంభంకానుంది. హెచ్‌ఐసీసీలో సాయంత్రం సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోసింగపూర్‌కు చెందిన సెమీకండక్టర్ల సంస్థ ఏఎస్‌ఈతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇవాళ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏఎస్‌ఈ గ్రూపు సంస్థ ప్రతినిధులు కలిశారు. ఆ సంస్థ అధ్యక్షుడు జెర్రీ చాంగ్.. ప్రత్యేకంగా మంత్రితో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగానికి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల గురించి మంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వెల్లడించారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ప్రతిభావంతులు ఉన్నారని, పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన వనరులు కూడా ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
Jerry Chang, President @asegroup_global met IT Minister @KTRTRS today on the sidelines of #GES2017
Minister explained about Telangana Govt's special focus on Electronics & Semiconductor sector. He also outlined the various initiatives of state government to foster innovation pic.twitter.com/25saEdPliw
— Min IT, Telangana (@MinIT_Telangana) November 28, 2017