ఎన్నో ఏండ్ల కల సాకారమవుతున్న వేళ ఆసన్నమయింది. ఇంకా కొన్ని గంటల్లోనే మెట్రో రైలు కూ.. చుక్.. చుక్ అంటూ పరుగులు తీయబోతున్నది. హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మెట్రో రైల్‌ను మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. అయితే.. హడావుడి వల్లో, లేకపోతే మరెందువల్లో కానీ మెట్రో రైలు శిలాఫలకంపై హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడైన మేయర్ బొంతు రామ్మోహన్ పేరు గల్లంతైంది.
మెట్రో శిలాఫలకంపై ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయ మంత్రి హరదీప్ సింగ్ పూరి పేర్లు మాత్రమే కనిపించాయి. ప్రొటోకాల్, ఇతర సంప్రదాయాల ప్రకారం మేయర్‌కు నగర ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.ఇందుకు విరుద్ధంగా ఆయన పేరును శిలాఫలకంలో చెక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.ఇదిలావుండగా ఇటు కమిషనర్ పేరు కుడా లేకపోవడం పట్ల అటు కార్పొరేట్లరు, ఇటు బల్దియా అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రధాని మంత్రి వెంట ఎవరెవరు మెట్రోలో ప్రయాణిస్తారు & శిలాఫలకంపై ఎవరెవరి పేర్లు ఉండాలో నిర్ణయించేది ప్రధానమంత్రికి చెందిన ప్రధాన కార్యాలయం.అందుకే గతంలో కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ మెట్రో రైలు ప్రారభోత్సవంలో కూడా ( కోచ్చిన్ మేయర్ పేరు శ్రీమతి సౌమిని జైన్) కూడా శిలాఫలకంపైన కూడా వేయలేదు .