స్టార్టప్‌లకు టీహబ్ వేదికగా నిలిచిందని రాష్ట్ర ఐ టీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీహబ్‌తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో టీహబ్‌తో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX India Innovation Challenge in partnership with @THubHyd. #Hyderabad #GES2017 #RoadToGES @startupindia @investindia pic.twitter.com/UztSXmpMyZ
— Min IT, Telangana (@MinIT_Telangana) November 28, 2017
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… టీ హబ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదన్నారు. టీహబ్ కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలుస్తున్నదని మంత్రి తెలియజేశారు. టీహబ్ దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ అని.. టీహబ్ దేశాన్నే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.