Home / MOVIES / ‘బిత్తిరి సత్తి’ పై దాడి చేసింది ఇతనే….కారణం ఇదేనంట..?

‘బిత్తిరి సత్తి’ పై దాడి చేసింది ఇతనే….కారణం ఇదేనంట..?

తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు.

v6 ఆఫీస్ నుంచి బయటికొస్తున్న సమయంలో, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఒకరు ఒక్కసారిగా సత్తిపై దాడి చేశారని సమాచారం. వెంటనే ఛానెల్ యాజమాన్యం సత్తిని స్టార్ హాస్పిటల్స్ కు తరలించింది. అదే సమయంలో దాడి చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. గాయపడిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. సత్తి చేసే తీన్మార్ కార్యక్రమంలో తెలంగాణ యాసను అవమానించినట్టు ఉండటమే కాక, పవన్ కళ్యాణ్ ను విచిత్రమైన పేర్లతో పిలుస్తూ సత్తి అవమానిస్తున్నాడని, ఆ కారణంగానే అతనిపై దాడికి పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat