అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డును ప్రకటించింది.ఇవాళ ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదికారులు వివరించారు.ఆదివారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం హైదరాబాద్ పరుగు కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అవయవ దానంలో అవార్డు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
