తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ,ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పవన్ కల్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేశారు అని అక్కడ ఉన్న వారు అంటున్నారు .అయితే ఇయన నిజంగా చేశాడా..?ఒకవేళ అలా చేస్తే ఎందుకో చేశాడో తెలియాల్సి ఉంది ..