నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను అమెరికా తెలంగాణ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో కలిశారు. 2018 జూన్ 29 నుండి మూడు రోజుల పాటు హ్యూస్టన్ లో జరిగే తెలంగాణ మహాసభలకు హాజరుకావాలని ఆటా ప్రతినిధులు ఎంపి కవిత ను కోరారు. మహాసభలను పురస్కరించుకుని నవంబరు 19నుంచి డిసెంబర్3వ తేదీ వరకు తెలంగాణలో చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కవిత కు వివరించారు. డిసెంబర్ 3న ఉదయం5కె రన్, సాయంత్రం రవీంద్రభారతి లో ప్రవాసీ తెలంగాణ ధూం-దాం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని .ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఎంపి కవితను కలిసిన వారిలో అమెరికా తెలంగాణ సంఘం చైర్మన్ కరుణాకర్ ఆర్ మాధవరం, అద్యక్షులు సత్యనారాయణ రెడ్డి , ఓవర్సీస్ కన్వీనర్ వెంకట్ మంతెన, ఇండియా కో కన్వీనర్ అమ్రిత్ ముళ్ళపూడి, తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా అధ్యక్షులు శ్రీధర్ బండారు పాల్గొన్నారు.
Launched American Telangana Association's Drug Free Hyderabad 5K Run poster.
I support "SAY NO TO DRUGS". pic.twitter.com/RItBxIT7kA— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 27, 2017