టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా బయట ఫంక్షన్ లలో హాజరుకాడు. తనకు బాగా కావలసిన వారినో.. లేక తన సినిమా ఫంక్షన్లలోనో తప్ప మహేష్ బయట కనిపించడు. అలాంటిది కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహ వేడుకకు మహేష్ సతీసమేతంగా హాజరై పెళ్లి వేడుకలో హాజరు అయ్యాడు. మహేష్ ఇలాంటి ఈవెంట్లకి చాలా అరుదుగా హాజరు అవుతూ ఉంటాడు.. దీంతో మహేష్ భలే చిక్కాడనుకొని ఈ సూపర్ స్టార్ పై మీడియా ఫోకస్ పెట్టింది. ఇప్పుడా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్…భరత్ అను నేను చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు తర్వాత కొరటాలతో శివ తో చేస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ సీఎం గా కనిపించబోతున్నాడు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్హకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
