ప్రముఖ నటి, హీరో సూర్య భార్య జ్యోతికపై కేసు నమోదు చేశారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినిమాల్లో స్కిన్ షోలకు సైతం దూరంగా ఉండే ఈ నటి పై కేసు ఎందుకు నమోదు అయిందంటే తమిళ చిత్రాలతో పాటు అనేక తెలుగు సినిమాల్లో నటించిన జ్యోతిక సూర్యతో పెళ్లి అయిన తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వివాహం అనంతరం పెళ్లి అయి బిడ్డ పుట్టిన తర్వాత ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ నాచియార్ షూటింగ్ చివరి దశకు చేరింది.
ఇక తాజాగా విడుదల అయిన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న జ్యోతిక బూతు డైలాగు చెప్పింది. ఆ డైలాగు మహిళలను కించ పరిచేవిధంగా ఉందని, అటువంటి డైలాగును ఒక మహిళగా వ్యతిరేకించాల్సింది పోయి.. చెప్పినందుకు సెక్షన్ 294-బి ప్రకారం ఆమెను శిక్షించాలని రాజన్ కోయంబత్తూరు కోర్టుని కోరారు. నాచియార్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజన్ సినిమాలో మహిళలను కించపరిచే సంభాషణలు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించారు. హీరోయిన్ జ్యోతికను ప్రతివాదిగా తన పిటీషన్‌లో చేర్చారు. సినిమాని సహజత్వానికి అతి దగ్గరగా తీసే బాల ఈ డైలాగును ఉంచుతారా.. తొలిగిస్తారా.. అని తమిళ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్ అయ్యింది.