రాజకీయ సమరంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధం ఎప్పుడు ఉండేదే అయినా , అప్పుడప్పుడు ఆ యుద్ధం తారా స్థాయిలో ఉంటుంది . ఇక అనంత పురం రాజకీయాల్లో తలపండిన జేసీ సోదరులు రాజకీయంగా ఎంత అనుభవజ్ఞులో.. వారు ప్రత్యర్థుల పై చేసే విమర్శలు కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ తన ఉనికిని గట్టిగా చాటుకుంటుందని… టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాను ఢీకొట్టే మగాడు జగన్ ఒక్కడేనని జేసీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తదుపరి ఎన్నికల్లో జగన్ గెలిస్తే తాను సంతోషిస్తానని చెప్పారు. జగన్‌లో ఇప్పుడు ఉత్సాహం పెరిగిందని, ప్రజల్లో ఏ మేరకు ఉత్సాహాన్ని చూరగొంటాడో చూడాలని చెప్పారు. ఇక తనను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎన్నడూ అనుకోలేదని జేసీ అన్నారు. అంతేగాక, ‘నువ్వు అక్కడికి వెళ్లు, ఇక్కడికి వెళ్లు, ఆ పని చేయ్యి, ఈ పని చెయ్యి అని ఎన్నడూ చెప్పలేదని తెలిపారు. జగన్ వర్గాన్ని ఢీకొట్టే శక్తి తనకు ఉందో, లేదోనన్న విషయమై చంద్రబాబుకు కూడా అవగాహన లేదని అన్నారు. తనను నమ్మడం, నమ్మకపోవడం చంద్రబాబు ఇష్టమని అన్నారు.