ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను సంతలో గొర్రెలను కొన్నట్లు కోట్లు కుమ్మరించి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనేసి పచ్చ కండువా కప్పుతున్నారు అని వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన విమర్శ .తాజాగా రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాకు చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఈ రోజు సోమవారం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు .
అయితే దీనిపై స్పందించిన వైసీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో ఆఫర్ చేశారు అని ఆరోపించారు .టీడీపీ పార్టీలో చేరితే దాదాపు ఇరవై ఐదు కోట్లు ఇస్తామని ఎమ్మెల్యే ఈశ్వరీకి టీడీపీ అధినేత డీల్ కుదిరిచ్చారు అని వారు ఆరోపిస్తున్నారు .
ఇందులో పది కోట్ల రూపాయలు చేతికి ..మిగిలిన పదిహేను కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో చెల్లిస్తామని చెప్పినట్లు తమ దగ్గర సమాచారం ఉందని వారు ఆరోపిస్తున్నారు .అయితే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎంపీ సీటు దక్కకూడదు అనే లక్ష్యంతో బాబు ఈ కుట్రకు తెరతీశారు అని వారు విమర్శించారు ..