ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా నేడు సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు .
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు చెందిన ప్రధాన అనుచరుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే షాకిచ్చాడు .విషయానికి వస్తే వైసీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు ఆమె ప్రధాన అనుచరవర్గం వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చింతపల్లి జడ్‌పీటీసీ పద్మకుమారి గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి తానూ కానీ లోకల్ క్యాడర్ కానీ టీడీపీలోకి వెళ్లడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.