టీమిండియా జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాగపూర్ వేదికగా జరిగిన లంక చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.అయితే ,మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ మైల్స్టోన్కు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు అశ్విన్.
తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కెరీర్లో అశ్విన్‌కిది 54వ టెస్ట్ మాత్రమే కావడం విశేషం. కెరీర్లో ఇప్పటివరకు 26సార్లు 5 వికెట్లు, 7సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. తన కెరీర్ ముగిసేలోపు ఇంతకు రెట్టింపు వికెట్లు సాధిస్తానని మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ చెప్పాడు. 36 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ తన 56వ టెస్ట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు లిల్లీ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.