వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .ఆప్ పార్టీ ఐదో వార్షికోత్సవాన్నిపురష్కరించుకొని రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని విభజించాలన్న పాకిస్థాన్ లక్ష్యాన్ని మూడేళ్ళలోనే బీజేపీ సాకారం చేసిందని ఆయన ఆరోపించారు .హిందువులను ,ముస్లింలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టేందుకు బీజేపే పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు .డెబ్బై ఏళ్ళలో పాకిస్థాన్ ,ఐఎస్ఐ చేయలేకపోయిన పనిని బీజేపీ చేసిందని ఆయన ఆరోపించారు .
