తెలుగు బుల్లితెర వివాదాస్పద హాట్ కామెడీ షో జబర్ధస్త్ పై జరుగుతున్న రగడ పై అదే షో హాట్ యాంకర్ అనసూయ స్పందిస్తూ.. ఆది చేసిన స్కిట్‌లో తప్పేం ఉందో తనకు అర్థం కావడంలేదని ఆ స్కిట్ ఉన్న పాత్రను ఉద్దేశించి జోక్ చేసిందే తప్ప అందులో వివాదం చేయాల్సినంత సీన్ ఏం లేదన్నారు. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా.. అనవసర లాజిక్‌లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయ్. సమాజానికి ఉపయోగపడే విషయాలు గురించి చర్చిస్తే మంచిదని ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే అనసూయ చేసిన ఆ వ్యాఖ్‌ిలతో ఇటీవల సంచలనం రేపిన అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ చేతిలో మాత్రం బుక్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో రచ్చ లేపిన విజయ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా లోని మా*ద్ డైలాగ్‌కు తీవ్ర అభ్యంతరం చెప్పి మీడియాకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ షోలో అనాథలను హేళన చేస్తూ హైపర్ ఆది వేసిన కామెడీ స్కిట్‌ను మాత్రం ఫన్‌గానే చూడాలంటూ అనసూయ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయ ఫై నిప్పులు చెరుగుతున్నారు. మరి అర్జున్ రెడ్డి విషయంలో ఎందుకు అతిగా స్పందించావంటూ మండిపడుతున్నారు. కామెడీని కామెడీగా చూడాలని చెపుతున్నావు.. నాడు సినిమాను సినిమాలాగే చూడాలని ఎందుకు చెప్పలేదంటూ విరుచుకుపడ్డారు. దీంతో అనసూయ చేసిన అతే ఆమెను బుక్ చేసిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.