గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 9న మొదటి దశ, 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్ లో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి రేఖాబెన్ చౌదరి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయడమేకాక, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ… కారణమేంటో ఆమె అధికారికంగా ప్రకటించలేదు.
