రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంబించనున్న విషయం అందరికి తెలిసిందే . ఈ క్రమంలో మెట్రోరైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో నిర్మించిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు అద్దం పట్టేలా ఈ పైలాన్‌ను రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మెట్రో ప్రాజెక్టుకు ఈ పైలాన్ అదనపు అందాలను తీసుకురానున్నది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మూడు కారిడార్లకు ప్రతీకగా మూడు ఆర్చ్‌లను ఏర్పాటు చేశారు. మెట్రో రైలులో ఎక్కువగా వినియోగించిన నీలి రంగును ఆర్చ్‌లకు, మెట్రో కోచ్‌లకు గుర్తుగా స్టెయిన్ లెస్ స్టీల్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. మధ్యలో ఏర్పాటు చేసిన నీటి కొలనులో వీటిని చూడగానే మెట్రో కారిడార్ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో వెలుగుల మధ్య నీటి కొలనులో దృశ్యం చూస్తే త్రీడీలో ఆర్చ్‌లు కనిపించేలా ఏర్పాటు చేశారు.