గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుండటంపై ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జీఈఎస్ నిర్వహిస్తున్నారని…ఇందుకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నదని సోమవారం రాత్రి పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వం, భారత సర్కారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపింది.
కాగా, జీఈఎస్ కోసం నీతి అయోగ్ ప్రత్యేక యాప్ రూపొందించగా…భారీ డౌన్లోడ్లు అయ్యాయి.జీఈఎస్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు నీతి అయోగ్ అనేక ప్రణాళికలతో ముందుకు సాగింది. ఇందులో భాగంగా వచ్చే డెలిగేట్లకు ఇబ్బందికాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మొబలై యాప్‌ను రూపొందించింది.ఈ యాప్‌కు తక్కువ సమయంలోనే 1500 డౌనోలోడ్లు రావడం విశేషం.
Post Views: 445