తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం కీలక చర్యలు తీసుకుంటున్నదని భారతదేశంలో అమెరికా రాయబారి కెన్ జెస్టర్ ప్రశంసించారు. ఈ విషయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జెస్టర్‌తో మంత్రి కేటీఆర్ సమావేవం అయ్యారు. ఈ భేటీ గురించి జెస్టర్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను కలవడం సంతోషకరమని తెలిపారు. జీఈఎస్ 2017కు అద్భుతమైన ఏర్పాట్లు చేయడంపై వారికి ఆయన అభినందనలు తెలిపారు. హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, విద్యుత్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విషయమై చర్చ జరిపినట్లు జెస్టర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశం సందర్భంగా కెన్ జెస్టర్‌ను పోచంపల్లి శాలువాతో సత్కరించిన మంత్రి కేటీఆర్ జ్ఞాపిక బహుకరించారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ హడ్డా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత రాయబారితో సమావేశంతో తన దినచర్య ప్రారంభమైందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, అనంతరం జీఈ ఆసియా అధ్యక్షుడు విశాల్ వాంచూతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.
Post Views: 434