రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా దాదా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వై సీ పీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి 18వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ప్రారంభమైంది. రామకృష్ణాపురంలో ముస్లిం మత పెద్దలు వైఎస్ జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా అధికారంలోకి మసీదుల నిర్వహణకు రూ. 15 వేలు, ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజమ్‌లకు రూ. 5 వేల వేతనం ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
